జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతం పెంపునకు విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నవంబర్ 30 వర కు పూర్తిస్థాయిలో ప్రత్యేక హాజరు మహోత్సవ్‌లో భాగంగా వందశాతం అటెండెన్స్ డ్రైవ్ చేపట్టాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయుల హాజరును ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ ద్వారా నమోదు చేయాలని సూచించారు.
జిల్లాలో 810 ప్రభుత్వ పాఠశాలలు
జిల్లాలో 810 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 67వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 4,200 మంది ఉపాధ్యాయులున్నారు. వీరు పాఠశాలలకు చేరుకోగానే ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేస్తారు. కొన్ని పాఠశాలల్లో హాజరు నమోదులో సాంకేతిక సమస్యలు ఎదురవడంతో ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. నెట్వర్క్, ఎఫ్ఆర్ఎస్ సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించాలి. ఉన్నతాధికారులు వారానికొకసారి పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులను బడికి రప్పించేలా ప్రణాళిక చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వరుసగా విద్యార్థి వారం రోజుల పాటు స్కూల్‌కు రాకపోతే నేరుగా ఇంటికి వెళ్లి విద్యార్థి ఎందుకు రావడం లేదో చూడాల్సి ఉంటుంది. పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానం కోసం కృషి చేస్తుండగా, తాజాగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం మెరుగుపర్చేందుకు ఈ సెప్టెంబర్ మాసంలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ‘ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు పర్యవేక్షిస్తారు. అటెండెన్స్‌పై సమీక్షిస్తారు’ అని డీఈవో రాము వివరించారు.
ఎఫ్ఆర్ఎస్ హాజరుపై ప్రతిరోజు పర్యవేక్షణ
ఉపాధ్యాయులు, విద్యార్థుల అటెండెన్స్‌పై దృష్టి


