జగిత్యాల టౌన్: పుస్తక పఠనంతో విద్యార్థులు, యువత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సూచించారు. శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకోవాలని కోరారు. జిల్లాకేంద్రంలో ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేశామని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోరిక మేరకు జిల్లా గ్రంథాలయంలో వసతులు కల్పించామన్నారు. రూ.కోటి వ్యయంతో నూతన లైబ్రరీ భవనాన్ని మంజూరు చేశామని, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గ్రంథాలయ నూతన భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చైర్మన్ దృషి సారించాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేశ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, పీఎసీఎస్ చైర్మన్ దామోదర్‌రావు, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, ముఖేశ్ ఖన్నా పాల్గొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


