పశుగ్రాసం సాగుకు తోడ్పాటు | - | Sakshi
Sakshi News home page

పశుగ్రాసం సాగుకు తోడ్పాటు

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

వేసవిలో కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక పాడి రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ దాహం తీర్చేందుకు ప్రతి గ్రామానికి రెండు నీటితొట్టీల నిర్మాణం

జగిత్యాలరూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఎండాకాలంలో పశువులకు గడ్డి కొరత రాకుండా కేంద్రం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా గ్రామాల్లో పశుగ్రాసం సాగుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వీబీజీరాంజీ పథకం నిధుల్లో 5 శాతం వెచ్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రత్యేక పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సొంత వ్యవసాయ భూమి, నీటి వసతి ఉన్న రైతులు పచ్చిగడ్డి పెంచేలా వారికి ఆర్థిక సాయం అందిస్తోంది.

ఎకరానికి రూ.14 వేలకు పైగా..

ఎకరంలో పశుగ్రాసం సాగుకు విత్తనాలు, కంచె, ఎరువులు తదితరాలకు ఖర్చు రూ.3,551, లేబర్‌ ఖర్చు రూ.10,475 కలుపుకొని మొత్తం రూ.14,023ను ఒక యూనిట్‌గా పరిగణించి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. జాబ్‌ కార్డు ఉన్న రైతులు సొంతంగా పని చేసుకున్నా సరే ఉపాధి హామీ పథకం కింద కూలీ డబ్బులు వారి ఖాతాల్లోనే పడతాయి. నేపియర్‌, మొక్కజొన్న, జొన్న, గినియా, లూసెర్న్‌ వంటి హైబ్రీడ్‌ రకాలను ఇందులో సాగు చేయాల్సి ఉంటుంది.

ఎన్‌ఎల్‌ఎం ద్వారా రూ.55 వేల లబ్ధి

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ (ఎన్‌ఎల్‌ఎం) పథకాన్ని మరింత పటిష్టం చేస్తున్నారు. ఎకరం పొలంలో వరుసగా మూడేళ్ల పాటు పశుగ్రాసాన్ని పెంచే రైతులకు విడతల వారీగా రూ.55 వేల ఆర్థిక సాయాన్ని సబ్సిడీ రూపంలో ఇవ్వనున్నారు. దీనిపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఆసక్తి గల రైతులకు యూనిట్ల మంజూరు

మొదటి విడతలో ప్రతి గ్రామం నుంచి అర్హులైన రైతులను ముందస్తుగా ఎంపిక చేయాలని అధికా రులను ఆదేశించారు. ఆ తర్వాత ఎంతమంది రైతులు ముందుకు వచ్చినా పరిమితి లేకుండా ప్రభుత్వ మే పూర్తి ఖర్చు భరిస్తుంది. ఈ నాణ్యమైన పచ్చిగడ్డితో పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా పాల దిగుబడి కూడా పెరుగుతుంది. దీనివల్ల పాడి రైతులు వేసవిలో మేత కోసం అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.

దాహార్తి తీర్చేలా ఊరికి రెండు నీటి తొట్లు

వేసవిలో మూగజీవాలు నీళ్ల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి గ్రామంలోని ప్రధాన వీధుల్లో రెండు నీటి తొట్టెలను నిర్మించనున్నారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఒక్కో తొట్టికి రూ.35 వేలు ఖర్చు చేస్తారు. తొట్టి నిర్మాణంతో పాటు దానికి పై పులైన్‌ వేసి, ఎప్పటికప్పుడు నీరు నింపే బాధ్యతను గ్రామ పంచాయతీలు తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement