జగిత్యాల: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు ఆదివారం కొత్త పింఛన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి అందించారు. పేదలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామన్నారు. జిల్లాలో 13,913 మందికి కొత్త పింఛన్ మంజూరయ్యాయని, ఇంకా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలని, విచారణ చేపట్టి మంజూరు చేస్తామన్నారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. కొత్త పింఛన్లు అందించడం శుభ పరిణామమన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మా ట్లాడుతూ.. జిల్లాలో సుమారు 2.13 లక్షల లబ్ధిదారులకు ప్రతినెలా పింఛన్ అందిస్తున్నామన్నారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మందకృష్ణను కలిసిన ఎమ్మెల్యే, మంత్రి
జిల్లాకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ రాగా.. మంత్రి, ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలి శారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు నందయ్య ఉన్నారు.


