మంత్రిని కలిసిన న్యాయవాదులు | - | Sakshi
Sakshi News home page

మంత్రిని కలిసిన న్యాయవాదులు

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

జగిత్యాలజోన్‌: తమ సమస్యల పరిష్కారించాలని కోరుతూ.. ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యేను జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదుల బృందం కలిసింది. జిల్లాకేంద్రానికి మూడు కోర్టులు మంజూరైనందున వాటికి ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. ప్రస్తుతమున్న కోర్టును ఆనుకుని.. రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలను అప్పగించాలని సూచించారు. దీనికి మంత్రి, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదుల కమిటీ కన్వీనర్‌ ముదుగంటి జనార్ధన్‌ రెడ్డి, సభ్యులు కొలుగూరి దామోదర్‌ రావు, బండ భాస్కర్‌ రెడ్డి, రాచకొండ శ్రీరాములు, కరవత్తుల భూమయ్యలు పాల్గొన్నారు.

గిరిజన హక్కుల పోరాట యోధుడు బిర్సా ముండా

రాయికల్‌: ఆదివాసీ గిరిజన హక్కులకు పోరాడిన యోధుడు బిర్సా ముండా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. మండలంలోని జగన్నాథ్‌పూర్‌లో బిర్సా ముండా 150వ జయంతిని ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బానోత్‌ తిరుపతినాయక్‌, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ నారాయణ, జిల్లా కార్యదర్శి ఏనుగు ముత్యం రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నవేని వేణు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు అశోక్‌, రాయికల్‌ అధ్యక్షుడు ఆకుల మహేశ్‌, పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

గిరిజనుల దేవుడు బిర్సాముండా

జగిత్యాల: జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, నాయకులు సత్యం, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ నిషేధానికి సహకరించాలి

జగిత్యాలరూరల్‌: గ్రామాల్లో ప్లాస్టిక్‌ నిషేధానికి సహకరించాలని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి కొట్టాల తిరుపతి రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ శీతాకాల శిబిరంలో భాగంగా ప్లాస్టిక్‌ నిర్మూలనపై గ్రామస్తులకు ఆదివారం అవగాహన కల్పించారు. వలంటీర్లు గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్లాసి్‌ట్‌క్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నల్ల కవిత, ఉప సర్పంచ్‌ ఎడమల సత్తిరెడ్డి, ప్లాస్టిక్‌ నిర్మూలన ఉద్యమకర్త నాగిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి, నాయకులు సంజీవ్‌, ప్రతిభ, స్వామి, పవన్‌, సంతోష్‌ రెడ్డి, తిరుపతి, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కొప్పెర వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఇంటికి చేరిన మాజీ మావోయిస్ట్‌

కథలాపూర్‌: మండలంలోని చింతకుంటకు చెందిన మాజీ మావోయిస్ట్‌ అనంత్‌ అలియాస్‌ మ్యాకల వినోద్‌ భార్య రాణుతో కలిసి ఆదివారం ఇంటికి చేరాడు. వినోద్‌ మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుంచి వెళ్లి మావోయిస్ట్‌ పార్టీలో చేరాడు. పార్టీలో వివిధ హోదాలో పనిచేసి మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ జోన్‌ ఇన్‌చార్జిగా పనిచేశాడు. గతేడాది నవంబర్‌ 28న మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయినప్పటికీ ఏడాదికాలంగా పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు. మే నెలలో పోలీస్‌ సెక్యూరిటీతో ఇంటికి వచ్చి వెళ్లిపోయాడు. పోలీసుల అంక్షలు ముగియడంతో వినోద్‌ తన భార్య రాణుతో కలిసి ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో ఆనందం నెలకొంది. వినోద్‌ను చిన్ననాటి మిత్రులు కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement