జాబ్‌మేళాతో యువతకు ఉపాధి | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాతో యువతకు ఉపాధి

Nov 15 2026 1:08 PM | Updated on Nov 15 2026 1:08 PM

మెట్‌పల్లి: యువతకు ఉపాధి కల్పించడం కోసమే జాబ్‌మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని వెంకట్‌రెడ్డి గార్డెన్‌లో శనివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జాబ్‌మేళాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారి కుటుంబాలకు అర్థిక భరోసా కలుగుతుందన్నారు. ఇందుకోసం పలు కంపెనీలతో చర్చించి వారి సహకారంతో జాబ్‌మేళా ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మేళాలు మరిన్ని నిర్వహిస్తామని, యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌ మేళాకు సుమారు 1,500మంది యువత హాజరు కాగా, 750మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement