జగిత్యాలఅగ్రికల్చర్: ఏ ఊరిలో పండిన సన్న ధాన్యాన్ని ఆ ఊళ్లోనే బియ్యంగా మార్చి అదే గ్రామంలోని రేషన్ షాపులకు ఇవ్వాలని జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏకగ్రీవంగా తీర్మానించింది. సంస్థ సమావేశం చైర్మన్ సంగెపు తిరుపతిరెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఏడీఏ అశోక్‌కుమార్ పాల్గొని సంస్థ అభివృద్ధికి సూచనలు చేశారు. గ్రామాల్లో యువత రైస్‌మిల్లులు ఏర్పాటు చేయడం ద్వారా మరో పది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడుతుందన్నారు. సంఘం గౌరవ అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.


