విచ్చలవిడిగా హుక్కా, గంజాయి | - | Sakshi
Sakshi News home page

విచ్చలవిడిగా హుక్కా, గంజాయి

Oct 2 2026 3:03 AM | Updated on Oct 2 2026 3:03 AM

● ఇటీవల జిల్లా కేంద్రంలో పోలీసులు గంజాయి, గుట్కా, హుక్కాపై ప్రత్యేక పోలీస్‌ టీంలను ఏర్పాటు చేశారు. ● గంజాయి, హుక్కా సేవిస్తున్న వీరిలో ఎక్కువమంది మైనర్లు, యువతే ఉన్నట్లు గుర్తించారు. ● వారివారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపిస్తున్నారు ● వీటి సరఫరాపై పోలీసులు నిఘా పెట్టడంతో రహస్య ప్రదేశాల్లో అమ్మకాలు చేస్తున్నారు.

జగిత్యాలక్రైం: గంజాయి, హుక్కా వ్యసనంతో యువత పక్కదారి పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో గంజాయి అమ్ముతున్న పలువురిని అరెస్ట్‌ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఊట్నూరు, మంచిర్యాల, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి రహస్యంగా తీసుకొస్తున్నారు. దానిని యువతకు విక్రయిస్తుండడంతో బానిసలుగా మారి ఏం చేస్తున్నారో తెలియనిస్థితికి చేరుకుంటున్నారు. మరికొందరు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. సాధారణంగా హుక్కాలో పలు రకాల ఫ్లేవర్స్‌ వినియోగిస్తుంటారు. మత్తు కోసం హుక్కాను అతిగా వినియోగిస్తున్న యువత నానా హంగామా సృష్టిస్తున్నారు. మద్యం సేవిస్తున్నప్పుడూ గంజాయి, ఇతరత్రా మత్తు ఫ్లేవర్స్‌ వినియోగిస్తున్నారు. పోలీసు శాఖ కొద్దికాలంలో హుక్కా నివారణపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

విద్యార్థులే అధికం

మత్తు పదార్థాల వినియోగంలో అత్యధికంగా కళాశాల విద్యార్థులే ఉంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. 18 నుంచి 30 ఏళ్ల యువకులు గ్రూపులుగా ఏర్పడి గంజాయి, హుక్కాను సేవిస్తూ మత్తులో తేలుతున్నారు. జిల్లాకేంద్రంలోని గొల్లపల్లి రోడ్‌.. మంచినీళ్లబావి.. గీత విద్యాలయం సమీపంలో.. ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల సమీపంలో, చింతకుంట, కండ్లపల్లి చెరువు, కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రాంతం, కల్లూరు రోడ్‌ ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా

హుక్కాను మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి యువత తెప్పించుకుంటున్నట్లు సమాచారం. గంజాయిని పొరుగు జిల్లాల నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల నిఘాలో వెలుగుచూసిన నిజాలు

కేసులు నమోదు చేస్తున్నాం

గంజాయి రవాణా, విక్రయాలపై పోలీసు శాఖ నిఘా పటిష్టం చేశాం. గంజాయి విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నాం. యువత తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలి.

– అశోక్‌కుమార్‌, ఎస్పీ

జగిత్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఆరు నెలల క్రితం గంజాయి, హుక్కాకు అలవాటుపడి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి రిహాబిలిటేషన్‌లో చేర్పించి నెల పాటు చికిత్స అందించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

వ్యసనం బారిన యువత

జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా విక్రయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement