● కలెక్టర్‌కు మాజీమంత్రి జీవన్‌రెడ్డి లేఖ
జగిత్యాల: పట్టణంలోని పురాతన తహసీల్దార్ కార్యాలయాన్ని తొలగించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు ఏకపక్షంగా అప్పగించడంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కలెక్టర్ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. తహసీల్దార్ భవనాన్ని 1905లో నిర్మించారని, పురాతన కట్టడాల పరిరక్షణ విభాగం అనుమతి లేకుండా కూల్చివేశారని, జీవో నంబరు 571 రెవెన్యూ శాఖను సాకుగా చేసుకుని పెట్రోల్ బంక్‌కు కేటాయించారని తెలిపారు. నామమాత్రపు అద్దెకు లీజుకు ఇవ్వడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. అలాట్‌మెంట్ చేసిన భూమికి ఏడాదికి రూ.14లక్షల అద్దె రావాల్సి ఉండగా.. కేవలం రూ.72వేలకు మాత్రమే కేటాయించడం సరికాదని తెలిపారు.
గ్రౌండ్ ఫిట్‌నెస్ కోచింగ్ ప్రారంభం
కోరుట్ల: ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష కోసం గ్రౌండ్ ఫిట్‌నెస్ కోచింగ్‌ను పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ఎస్జీఎఫ్ సెక్రటరీ చక్రాదర్ ప్రారంభించారు. శిక్షణను పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు సద్వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఎలుగూరి కిరణ్, జిల్లా పీఈటి ప్రెసిడెంట్ వాసం నవీన్ కుమార్, పిజికల్ డైరెక్టర్లు గౌటి రవీందర్, వాసాల రాజు, పీఈటి వేణు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
కోరుట్లరూరల్: కోరుట్ల మున్సిపల్ పరిధిలోని యెఖీన్‌పూర్‌లో వన్ మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను విద్యుత్ ఎస్‌ఈ సుదర్శనం గురువారం ప్రారంభించారు. ఎన్‌పీడీసీఎల్‌లో ఇది వందో ప్లాంట్ అని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు సోలార్ ప్లాంట్లు ఉపయోగపడుతాయని ఎస్‌ఈ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈ గంగారాం, ఏడీ భూమేశ్వర్, రూరల్ ఏఈ వరప్రసాద్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
సోలార్ వినియోగం పెంచేందుకు చర్యలు
జగిత్యాలఅగ్రికల్చర్: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సోలార్ వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సుదర్శనం అన్నారు. జిల్లాకేంద్రంలో సోలార్ సేవ సేతు అభియాన్ కింద మూడు రోజుల శిక్షణను గురువారం ప్రారంభించారు. పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎడీఈ నాయక్, ఏఈలు, రెడ్కో సిబ్బంది పాల్గొన్నారు.
సీఈసీ రాజీనామా చేయాలి
జగిత్యాల: ఎన్నికల కమిషన్ తీరుతో ఓటర్లు అయోయమంలో పడ్డారని, చట్టం ఉల్లంఘనకు బాధ్యత వహిస్తూ కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఏకపక్ష నిర్ణయాలతో ఓటర్ల నమోదు ప్రక్రియలో ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 13 కోట్ల ఓటర్లను పునరుద్ధరించాలని కోరారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణ, సహాయ కార్యదర్శి భూమేశ్వర్, ఎండీ.ముఖ్రం పాల్గొన్నారు.
జిల్లాలో సిటీ పోలీస్‌యాక్ట్ అమలు
జగిత్యాలక్రైం: శాంతిభద్రతల నేపథ్యంలో ఈనెల 31వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.


