ఉల్లాసంగా.. ఉత్సాహంగా..! | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..!

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

● ఘనంగా పర్యాటక దినోత్సవం ● చెన్నకేశవనాథ ఆలయ అభివృద్ధికి కృషి ● పర్యాటక, పురావస్తు శాఖ సహకారంతో ముందుకు

● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ● 180 మంది విద్యార్థులకు ప్రశంస పత్రాలు ● ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

రాయికల్‌: రాయికల్‌ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీచెన్నకేశవనాథ ఆలయంలో ఆదివారం నిర్వహించిన పర్యాటక దినోత్సవం ఆద్యంతం ఆకట్టుకుంది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి వచ్చిన సుమారు 300 మంది విద్యార్థినులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఆలయ చరిత్రను తెలుసుకున్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలల్లో గతంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చినవారికి ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమానికి హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పర్యాటక, పురా వస్తు శాఖల సహకారంతో చెన్నకేశవనాథ స్వామి త్రికూటాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ మాట్లాడుతూ.. పురాతన ఆలయాల అభివృద్ధికి పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ మచ్చ శ్రీధర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవి, జిల్లా పర్యాటక, యువజన క్రీడల అధికారి రవికుమార్‌, డీఈవో రాము, తహసీల్దార్‌ నాగార్జున, కమిషనర్‌ మనోహర్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తురగ సౌజన్య, ఎంపీవో సుష్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

తప్పిన ప్రమాదం

ఆలయం ఆవరణలోని ఫంక్షన్‌హాల్‌లో సమావేశానికి అందరూ సిద్ధమవుతుండగా.. అందులో షార్ట్‌సర్క్యూ ట్‌ అయ్యింది. పొగలు రావడంతో అప్రమత్తమైన విద్యార్థులు హాల్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. ట్రాన్స్‌కో అధికారులు కరెంట్‌ నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించడంతో కార్యక్రమం యథావిధిగా కొనసాగింది.

విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతున్న అధికారులు, కళాకారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement