లే‘ఔట్‌’ మెట్‌పల్లిలో ‘మామూలే’ | - | Sakshi
Sakshi News home page

లే‘ఔట్‌’ మెట్‌పల్లిలో ‘మామూలే’

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

● అనుమతి లేకుండానే వెంచర్లు ● దర్జాగా ఇళ్ల నిర్మాణాలు ● టౌన్‌ ప్లానింగ్‌ విభాగం తీరుపై సర్వత్రా విమర్శలు ● లే ఔట్‌ అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం.. అందులో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ● చాలా చోట్ల కేవలం 18,21 ఫీట్ల రోడ్లు మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో ఆయా వీధుల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. ● మరోవైపు కొత్తగా ఏర్పడుతున్న కాలనీల్లో మున్సిపాలిటీకి పది శాతం స్థలాలు ఇవ్వకపోవడంతో వాటిలో మౌలిక వసతుల కల్పించడం మున్సిపాలిటీకి సాధ్యం కావడం లేదు. దీంతో పాటు ఇతర ప్రజా అవసరాల కోసం కూడా స్థలం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ● అయినా టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులకు కనువిప్పు కలగడం లేదు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పటికీ లే ఔట్‌ లేని వెంచర్లకు సహకారమందిస్తూన్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

‘పట్టణంలోని సాయిరాంనగర్‌ కాలనీలో ఓ బిల్డర్‌ నిర్మిస్తున్న ఇళ్లు ఇవి. గేటేడ్‌ కమ్యూనిటీ పేరుతో సుమారు 18 ఇళ్లు నిర్మిస్తున్న సదరు బిల్డర్‌ అక్కడ ఏమాత్రం మున్సిపల్‌ నిబంధనలను పాటించడం లేదు. లే ఔట్‌ అనుమతులు తీసుకోకుండానే ఆ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి అందులో ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం ఇళ్లు విక్రయించగా.. వాటికి అధికారులు ఇంటి నంబర్లు కూడా కేటాయించినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం..లే ఔట్‌ అనుమతి పొందిన తర్వాతే సంబంధిత వెంచర్‌లో ఇంటి నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు లే ఔట్‌ లేని వ్యవహారాన్ని ‘మామూలు’గా తీసుకొని దర్జాగా అనుమతులు ఇవ్వడంపై జోరుగా చర్చ సాగుతోంది.’

మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లి మున్సిపాలిటీలో రి యల్‌ వ్యాపారం జోరుగా సాగుతున్నప్పటికీ లేఔట్‌ నిబంధనల అమలు మాత్రం జరగడం లేదు. వ్యా పారులు వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి అందులో ఇళ్ల నిర్మాణాలు చేపడుతూ లే ఔట్‌ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నిబంధనల ప్రకారం మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ముందు లే ఔట్‌ ఉందా? లేదా? అని పరిశీలించాలి. కానీ, దీనిని పరిగణనలోకి తీసుకోకుండానే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.

జాడలేని పది శాతం స్థలాలు

పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. ముఖ్యంగా హ న్మాన్‌నగర్‌, రాంనగర్‌, సుల్తాన్‌పురా, టీచర్స్‌కాలనీ, సాయిరాంకాలనీ, వెంకట్రావ్‌పేట, బీడీకాలనీ ప్రాంతాల్లో ప్లాట్ల క్రయ విక్రయాలు, ఇళ్ల నిర్మాణా లు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే వీటిలో మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కేవలం సాయిరాంకాలనీలో ఒక్క వెంచర్‌ మాత్రమే లేఔట్‌ అనుమతితో ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మిగతా ఆయా కాలనీల్లో పదుల సంఖ్యలో వెంచర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇందులో ఒక్కటి కూడా లేఔట్‌ అనుమతి లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం లే ఔట్‌ అనుమతితో వెంచర్లు ఏర్పాటు చేస్తే సంబంధిత రియల్‌ వ్యాపారులు అందులో 33ఫీట్లతో రహదారులు, డ్రైనేజీలు, వీధి దీ పాల వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ము న్సిపాలిటీకి మొత్తం స్థలంలో పది శాతం అప్పగించాల్సి ఉంటుంది.వీటివల్ల ఆర్థికంగా నష్టం జరిగే అవకాశాలుండడంతో వ్యాపారులు లే ఔట్‌ అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముడుతున్నాయనే విమర్శలున్నాయి.

ఎన్నో ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement