పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పురావస్తు ఆలయాల విశిష్టత గురించి చక్కగా వివరించారు. క్షేత్రస్థాయిలో సందర్శించడం ద్వారా వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. అధికారులు చక్కగా వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలి.
– పుప్పాల రిత్విక, జెడ్పీహెచ్‌ఎస్, వెల్లుల్ల
విద్యార్థులతో సందర్శన బాగుంది
చెన్నకేశవనాథ ఆలయాన్ని జిల్లాలోని 20 మండలాల విద్యార్థులతో కలిసి సందర్శించడం ఆనందంగా ఉంది. వారికి ఆలయ విశిష్ఠత వివరించాం. వ్యాసరచన వంటి పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ప్రశంసపత్రం, మెడల్స్ అందించాం.
– రవికుమార్,
జిల్లా పర్యాటక శాఖ అధికారి


