కథలాపూర్: ఎమ్మెల్యే పదవిని హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో 34మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 68 మందికి సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.25.93 లక్షల విలువైన చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలన్నారు. తాను నాలుగుసార్లు ఓడిపోయినా ప్రజాక్షేత్రాన్ని వీడలేదన్నారు. ఈనెల 30న సిరిసిల్లలో జరిగే సీఎం సభకు జనసమీకరణపై నాయకులు, కార్యకర్తలు దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తోందన్నారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి సిరిసిల్ల సభకు తరలివచ్చేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, సీనియర్ నాయకులు బండ శంకర్, చెదలు సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, పులి హరిప్రసాద్, అజీం, వంగ మహేశ్, ఆకుల రాజేందర్, న్యావనంది శేఖర్, వాటికి రాజారెడ్డి, జంగ రంజిత్, అల్లూరి జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


