ప్రాథమిక పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించాలి. ఉపాధ్యాయుల కొరతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై తీవ్ర భారం పడుతోంది. మౌలిక వసతులు లేక నిర్వహణ సజావుగా చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరతను తీర్చాలి.
– బైరం హరికిరణ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
పోస్టులు భర్తీ చేయాలి
కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న హెచ్‌ఎం పోస్టులు భర్తీ చేయాలి. ఉపాధ్యాయులు లేకపోవడంతో ఒత్తిడి పడుతోంది. విద్యావలంటీర్లను నియమించాలి. 1+5 సిబ్బంది ఉండాలి.
– మచ్చ శంకర్, ఎస్టీయూ రాష్ట్ర అదనపు కార్యదర్శి


