వినాయకా.. సెలవిక | - | Sakshi
Sakshi News home page

వినాయకా.. సెలవిక

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

జిల్లాలో వినాయక నిమజ్జనం మూడురోజులుగా వైభవంగా జరుగుతోంది. మండపాల్లో నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరాడు. టవర్‌సర్కిల్‌లో గణనాథులకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకగా, ఒగ్గు, బంజారా, డప్పు కళాకారులు తమ కళారీతులను ప్రదర్శించి అలరించారు. కోరుట్ల, చింతకుంట చెరువు వద్ద కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తయ్యే వరకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోరుట్లలో మొదట శోభాయాత్ర ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకోగా, అక్కడ ప్రత్యేక అలంకరణతో పాటు వివిధ ఆకారాలు, సందేశాత్మక వినాయక శకటాలకు ఎమ్మెల్యే సంజయ్‌, వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు బహుతులు ప్రదానం చేశారు. ఆదర్శ యూత్‌కు ప్రథమ, యువతరం యూత్‌కు ద్వితీయ, కామునిపెంట యూత్‌కు తృతీయ, భారతీయ సంఘంనకు కన్సోలేషన్‌ బహుమతి అందజేశారు. అనంతరం గోదాంరోడ్‌, గాంధీరోడ్‌ అంబేద్కర్‌ రోడ్డు మీదుగా వెళ్లి వినాయకులను పెద్ద వాగులో నిమజ్జనం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరుమల వసంత, ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, డీఎస్పీ రాములు తదితరులు పాల్గొన్నారు. ధర్మపురిలో నిమజ్జన వేడుకలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతరం ధర్మపురితో పాటు రాయపట్నం గోదావరిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.

– జగిత్యాల/కోరుట్ల/కోరుట్లరూరల్‌/ధర్మపురి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement