జగిత్యాల: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన నాయీబ్రాహ్మణ సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. జగిత్యాల నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. జగిత్యాలలో అన్ని వార్డులకు రూ.కోటికి తక్కువ కాకుండా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, కౌన్సిలర్ వేముల శ్రీనివాస్, మహేందర్, బండ శంకర్ పాల్గొన్నారు.


