లోక్‌ అదాలత్‌లో సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో సత్వర న్యాయం

Sep 13 2026 12:12 AM | Updated on Sep 13 2026 12:12 AM

● జిల్లా న్యాయమూర్తి రత్నపద్మావతి ● రూ.2.34కోట్లకు పైగా పరిహారం చెల్లింపు

● జిల్లా న్యాయమూర్తి రత్నపద్మావతి ● రూ.2.34కోట్లకు పైగా పరిహారం చెల్లింపు

జగిత్యాలక్రైం: లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో మోటార్‌ వెహికల్‌ యాక్సిడెంట్‌ కేసులు 19 పరిష్కరించి రూ.2.34 కోట్లకు పైగా పరిహారాన్ని బాధితులకు అందించాలని సూచించారు. అడిషనల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి సునీత, సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వరరావు, రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ నికీషా, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సరిత పాల్గొన్నారు.

మెట్‌పల్లిలో 338 కేసులు పరిష్కారం

మెట్‌పల్లి: పట్టణంలోని కోర్టులో 338 కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు. పంతాలకు పోతే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ఏపీపీ ప్రణయ్‌, సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ దయ్య రాజారాం తదితరులున్నారు.

ధర్మపురిలో 479 కేసులు..

ధర్మపురి: పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి యేగి జానకీ ఆధ్వర్యంలో 479 కేసులు పరిష్కారం అయ్యాయి. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బందెల రమేశ్‌, ఉపాధ్యక్షు డు మామిడాల శ్రీకాంత్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు గడ్డం సత్యనారాయణరెడ్డి, రౌతు రాజేశ్‌, ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్‌, జాజాల రమేశ్‌, కార్తిక్‌, కలమడుగు కీర్తి తదితరులున్నారు.

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తక్కళ్లపల్లి విద్యార్థి

కథలాపూర్‌: మండలం తక్కళ్లపల్లి జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న రామగిరి ఘనదీశ్‌ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం లక్ష్మీనర్సయ్య శనివారం తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగే పోటీల్లో ఘనదీశ్‌ జిల్లా తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. ఘనదీశ్‌ను సర్పంచ్‌ రాజగంగారాం, పీఈటీ రాజేశ్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

తారకేశ్వరస్వామికి ఉత్తర నక్షత్ర పూజలు

కథలాపూర్‌: అయ్యప్పస్వామి జన్మనక్షత్రం సందర్భంగా మండలంలోని చింతకుంటలోగల శ్రీతారకేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర నక్షత్రం పూజలను శనివారం ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామికి అభిషేకం చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

రక్తదానం గొప్పది

కోరుట్ల: రక్తదానం ప్రాణదానంతో సమానమని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. పట్టణంలో శ్రీనివాస సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. 30 మంది రక్తదానం చేశారు. తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేయడం అభినందనీయమని నిర్వాహకులు అన్నారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షుడు ఊట్కూరి శ్రీనివాస్‌ రెడ్డి, కోరుట్ల ఐఎంఏ అధ్యక్షుడు వేముల రవికిరణ్‌, శ్రీనివాసుల సేవా సంస్థ కోరుట్లఽ బాధ్యుడు శ్రీరాముల శ్రీనివాస్‌, వనపర్తి చంద్రమోహన్‌, నీలి శ్రీనివాస్‌, హెల్త్‌ ఎడ్యూకేటర్‌ ధనుంజయ, కోరుట్ల ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

జగిత్యాలరూరల్‌: టపట్టణంలోని 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ గంగారాం తెలిపారు. మోతె ఉప కేంద్రం పరిధిలోని మోతె, వెల్దుర్తి, గొల్లపల్లి, పట్టణంలోని మహాలక్ష్మీనగర్‌, చిలుకవాడ, తహసీల్‌ చౌరస్తా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement