● డ్రైవర్‌పై కేసు నమోదు
జగిత్యాలక్రైం:అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన తిరుమల గంగాధర్ (60) ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందా డు. టీషాపు నిర్వహించే గంగాధర్ శని వారం సైకిల్‌పై పాల ప్యాకెట్లు తీసుకు ని టీస్టాల్‌కు వెళ్తుండగా జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై మెట్‌పల్లి డిపో బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గంగాధర్‌ను స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలింగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు అభిషేక్ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.


