గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః.. అంటూ ప్రతీ వ్యక్తి నాలుగు గోడల మధ్య నేర్చుకునే అక్షరాలు వారి జీవితంలో వెలుగును నింపుతాయి. తల్లిదండ్రులు జన్మనిస్తే... బడిలో పాఠాలు చెప్పే గురువులు ఆ జన్మకు సాకారాన్ని అందిస్తారు. మొన్నటి వరకు ఉపాధ్యాయులు పుస్తకంలోని పాఠాలను బోధించేవారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతీ అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. జీవితంలో ఎలా స్థిరపడొచ్చు అనే అంశాన్ని విద్యార్థులకు పాఠశాలస్థాయిలోనే చెబుతున్నారు. ప్రస్తుత కార్పొరేట్ పోటీ ప్రపంచంలో సర్కారు బడి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. ఆటల్లో జాతీయస్థాయిలో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నారు. తరగతి గదుల్లో వినూత్నంగా బోధన అందిస్తూ..
మా మంచి మా‘స్టార్లు’ అనిపించుకుంటున్నారు. నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి,
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!!


