ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

పెగడపల్లి(ధర్మపురి): ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా మానసిక ప్రశాంతత, సామాజిక ఐక్యతను పెంపొందించే అత్యున్నత కేంద్రాలుగా ఉపయోగ పడుతాయన్నారు. మండలంలోని రామబద్రునిపల్లి గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన సనాతన సంప్రదాయాలు, సంస్కృతి, పురాతన జీవన విధానాన్ని ఆలయాలు సజీవంగా నిలబెడుతాయని వివరించారు. ఆలయ నిర్మాణానికి పూనుకోవడం హర్షణీయమని, గ్రామస్తులు ఐక్యమత్యమై ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని, తోచిన విధంగా సాయం అందించి సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. ఇందుకు తానుకూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం పూర్తయితే గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొంది ప్రజల్లో భక్తిభావం పెరుగుతోందన్నారు. సర్పంచ్‌ కాశవేని కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ రాములుగౌడ్‌, మాజీ జెడ్పీటీసీ రాజేందర్‌రావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కడారి తిరుపతి, నా యకులు శ్రీనివాస్‌, అంజయ్య, లింగారెడ్డి, రవినా యక్‌,కిషన్‌, విజయభాస్కర్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం

వెల్గటూర్‌: పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రి శుక్రవారం హాజరయ్యారు. నూతన ఇంటిలో అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మహేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement