విద్యార్థుల ముంగిటకు విజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ముంగిటకు విజ్ఞానం

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

విద్యార్థుల ముంగిటకు విజ్ఞానం

జ్యోతినగర్‌: పాఠ్యపుస్తకాల్లోని అంశాలు బోధించడమే కాకుండా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తున్నారు ఉపాధ్యాయుడు గూళ్ల అంజన్‌కుమార్‌. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతినగర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌(బయోసైన్స్‌)గా పనిచేస్తున్న అంజన్‌కుమార్‌ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా జీవశాస్త్రాన్ని ప్రయోగాత్మక పద్ధతుల్లో బోధిస్తున్నారు. క్లిష్టమైన అంశాలను ప్రయోగాలు, నమూనాలు, దృశ్య ప్రదర్శనల ద్వారా వివరిస్తున్నారు. విద్యార్థులు స్వయంగా పరిశీలించి, ప్రశ్నించి, తెలుసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. మొబైల్‌ ల్యాబొరేటరీ ద్వారా విజ్ఞాన కార్యక్రమాల నిర్వహణ తదితర సేవలకు గుర్తింపుగా 2024లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement