క్రీడల్లో పదును పెట్టి.. జాతీయస్థాయికి చేర్చి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో పదును పెట్టి.. జాతీయస్థాయికి చేర్చి

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

క్రీడల్లో పదును పెట్టి.. జాతీయస్థాయికి చేర్చి

జమ్మికుంట: గ్రామీణ పాఠశాలల్లో చదివే విద్యార్థుల క్రీడా ప్రతిభకు పదును పెడుతూ జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నాడు జమ్మికుంట మండలంలోని కోరపల్లి ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జిట్టబోయిన శ్రీను. 2012లో ఫిజికల్‌ డైరెక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ విద్యార్థులకు క్రీడల్లో కీలకమైన మెలకువలు నేర్పిస్తున్నారు. జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం కోరపల్లి పాఠశాల నుంచి శ్రీను శిక్షణలో వనరసు సుశాంత్‌, ఇంజం రీతిక, ఎన్‌.లౌక్యశ్రీ, పింగిళి అక్షర జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌పోటీల్లో ప్రతిభ చూపారు. శ్రీను తన కెరియర్‌లో 80మంది క్రీడాకారులను తయారు చేశాడు. పలువురు ఇండియన్‌ ఆర్మీ, వివిధ పాఠశాలల్లో వ్యాయమ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శ్రీను జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యాడు.

– మరిన్ని కథనాలు – 8లోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement