33.0/24.0
7
గరిష్టం/కనిష్టం
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
జగిత్యాల: రాఖీ పండుగ సమీపించడం.. సెలవులు రావడంతో ప్రయాణికులతో జగిత్యాల బస్ స్టాండ్ బుధవారం కిక్కిరిసిపోయింది. బస్సులు కూడా తక్కువగా రావడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఒక్కో బస్సులో సుమారు 60 నుంచి 70 మందికి పైగా వెళ్లారు. పండుగ నేపథ్యంలోనైనా బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.


