ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్‌

Aug 27 2026 12:30 AM | Updated on Aug 27 2026 12:30 AM

● దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళ అయి ఉండాలి. ● నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, మేర/మేరు కమ్యూనిటీ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత. ● 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి ● గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు మించకూడదు. ● తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండి ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ● ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ● కుట్టువృత్తిలో నైపుణ్యం, ప్రాథమిక అక్షరాస్యత ఉన్న వారికి ప్రాధాన్యత ● అర్హులైన బీసీ మహిళలు వచ్చేనెల 13లోపు ఆన్‌లైన్‌లో http//tgobmm.cgg.gov.in దరఖాస్తులు చేసుకోవాలి. ● ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు కన్వీనర్లుగా ఉండగా, దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను జిల్లాస్థాయి కమిటికి పంపిస్తారు. ● జిల్లాస్థాయి కమిటీ ఆమోదం పొందిన అనంతరం బీసీ మహిళలకు ఆటోమెటిక్‌ కుట్టుమిషన్లు పంపిణీ చేస్తారు.

జగిత్యాల: బీసీ మహిళలకు ఆర్థిక సాధికారత సాఽ దించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టైలరింగ్‌లో నైపుణ్యం కలిగిన వారికి ఇందిరమ్మ పథకం పేరుతో ఆటోమెటిక్‌ కుట్టుమిషన్లు అందించనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే టైలరింగ్‌లో శిక్షణ పొంది నైపుణ్యం ఉన్న వారికి ఇది ప్రయోజనం. వందశాతం సబ్సిడీతో ఇందిరమ్మ కుట్టుమిషన్లు అందించనున్నారు.

నియోజకవర్గానికి వెయ్యి

ముందుగా నియోజకవర్గానికి వెయ్యి కుట్టుమిషన్లు అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలు న్నాయి. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది బీసీ మహిళలను ఎంపిక చేయనున్నారు. ఎంపికై న లబ్ధి దారులకు ఆటో మెటిక్‌ మిషన్లు అందించనున్నారు.

ఉపాధి అవకాశాలు

కుట్టుమిషన్ల ద్వారా బీసీలు ఉపాధి పొందే అవకా శం ఉంది. వందశాతం సబ్సిడీతో ఇస్తున్న ఈ మిషన్లను సద్వినియోగం చేసుకుంటే వ్యాపారాలు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. చాలామంది మెప్మా, సెర్ప్‌ ద్వారా కుట్టుమిషన్లలో శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఆటోమెటిక్‌ మిషన్ల ద్వారా కొంత పని తక్కువగా ఉంటుంది. దీని ద్వారా మహిళలకు మేలు కలుగుతుంది.

అర్హతలు

మండలస్థాయి కమిటీల ఏర్పాటు

నియోజకవర్గానికి వెయ్యి చొప్పున

బీసీ మహిళలకు ఉపాధి

వచ్చేనెల 13 చివరి తేదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement