అర్హులు ఓటు నమోదు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

అర్హులు ఓటు నమోదు చేసుకోండి

Aug 27 2026 12:30 AM | Updated on Aug 27 2026 12:30 AM

నేటి నుంచి గ్రామ, వార్డు సభలు

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. సర్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లను బీఎల్వోలు చదివి వినిపిస్తారని తెలిపారు. అక్టోబర్‌ ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువత తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు సభలకు హాజరై ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని, ఓటు హక్కును కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యాన్ని చాటుకోవాలన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు.

లక్ష్మీపూర్‌ సహకార సంఘం అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డి

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాలరూరల్‌ మండలం లక్ష్మీపూర్‌ పరస్పర సహాయ సహకార సంఘం ఎన్నికలు బుధవారం హోరాహోరీగా సాగాయి. 578 మంది సభ్యులకు 472 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానానికి సంగెపు తిరుపతి రెడ్డి, ఎడ్మల మల్లారెడ్డి పోటీపడ్డారు. తిరుపతి రెడ్డి 262 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డైరెక్టర్లుగా ఏనుగు లక్ష్మారెడ్డి, తీపిరెడ్డి బాపురెడ్డి, పన్నాల జీవన్‌రెడ్డి, ఎడమల జలేందర్‌ రెడ్డి, అత్తిన లింగన్న, లక్కం పవన్‌, గర్వందుల గంగయ్య, అరిగెల విజయ్‌కుమార్‌, గోస్కుల మహేష్‌బాబు, మేడిపల్లి లక్ష్మారెడ్డి, జవ్వాజి గంగాధర్‌, మిల్కూరి గంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

విదేశీ విద్య అధ్యయనానికి కుమ్మరిపల్లి ఉపాధ్యాయుడు

రాయికల్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విదేశీ విద్య అధ్యయనానికి మండలంలోని కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్‌రాజ్‌ ఎంపికై నట్లు ఎంఈవో రాఘవులు తెలిపారు. సెప్టెంబర్‌ 19 నుంచి 26వరకు సింగాపూర్‌లో పర్యటించి ఆ దేశంలో నిర్వహిస్తున్న ఉత్తమ విద్యాబోధన, విధానాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఈ సందర్భంగా అభయ్‌రాజ్‌ను ఉపాధ్యాయ సంఘం నాయకులు, గ్రామస్తులు అభినందించారు.

సమస్యల పరిష్కారానికి మహాధర్నా

పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు

రాయికల్‌: అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌లో తలపెట్టిన మహా ధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయినిపల్లి ఆనంద్‌రావు, యాళ్ల అమర్నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయికల్‌లో పీఆర్టీయూ ఉపాధ్యా య సమావేశం నిర్వహించారు. నిత్యవసర వస్తువు ల ధర పెరుగుతున్నందున పీఅర్సీని వెంటనే ఇవ్వాలని, సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్‌ వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ డీఏలు అందజేయాలని కోరారు. అనంతరం రాయికల్‌లో సంఘ పటిష్ఠతకు కృషి చేసిన రాపర్తి నర్సయ్యను సన్మానించారు. రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు పొన్నం రమేశ్‌, కుంబాల శ్రీనివాస్‌, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు కన్నవేని మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గాజంగి రాజేశం, జాదవ్‌ వసంతరావు రాజ్‌ మహమ్మద్‌, జగిత్యాల రూరల్‌ అధ్యక్షులు రాచర్ల చంద్ర శేఖర్‌,మాజీ అధ్యక్షులు రాపర్తి నర్స య్య, చెట్పల్లి బాపు రావు, ఉసకోల రాము, మాచర్ల మహేష్‌, తాటిపాముల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement