ఆపదలో సంజీవని | - | Sakshi
Sakshi News home page

ఆపదలో సంజీవని

Aug 14 2026 11:58 PM | Updated on Aug 14 2026 11:58 PM

● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 54 అంబులెన్స్‌ వాహనాలు సేవలందిస్తున్నాయి. ● కరీంనగర్‌లో 80 మంది, రాజన్నసిరిసిల్లలో 54, జగిత్యాలలో 74, పెద్దపల్లిలో 53 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ● గర్భిణీలను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చడం, ప్రమాద బాధితులకు వెంటనే వైద్యసేవలకు అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సహాయం అందించడం వంటి ఎన్నో సేవలు చేస్తున్నారు. ● కరోనా సమయంలో అప్పటి మంత్రి కేటీఆర్‌ ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ ద్వారా ఏడు అంబులెన్స్‌లను అందించడంతో అత్యవసర సేవలకు మరింత బలం చేకూరింది.

108.. 20 ఏళ్ల ప్రస్థానం మొబైల్‌ చికిత్సతో రోగులకు ఊరట దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ప్రారంభం ఉమ్మడి జిల్లాలో 54 అంబులెన్స్‌ సర్వీసులు

సిరిసిల్లటౌన్‌: అత్యవసర పరిస్థితుల్లో సంజీవనిలా ప్రాణాలు పోస్తున్న 108 సేవలకు ఇరవై ఏళ్లు నిండాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ మానస పుత్రిక అయిన 108 ద్వారా ఎందరో ప్రాణాలు నిలిచాయి. 2005లో 108 సర్వీసులు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది ప్రాణాలు నిలిపాయి. ఉమ్మడి జిల్లాలో 54 అంబులెన్స్‌ సర్వీసులు ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మూడు అంబులెన్స్‌లతో ప్రారంభమైన అత్యవసర సేవలు నేడు 12 అంబులెన్స్‌లతో బలోపేతమైంది. 108 సేవలు 21వ ఏటలోకి అడుగిడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

సుశిక్షుతులైన 108 సిబ్బంది

అత్యవసర వేళల్లో ప్రసూతి, ప్రమాదాల్లో క్షతగాత్రులకు 108 సర్వీసుల్లోని ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్స్‌), పైలట్‌(అంబులెన్స్‌ డ్రైవర్స్‌) ప్రత్యేక శిక్షణ పొందారు. అత్యవసర వైద్యం అందాల్సిన రోగులు ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ప్రాథమిక చికిత్స పొందుతున్నారు. ఇక అత్యవసరంగా ప్రసూతి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే 108 సిబ్బంది పురుడు పోస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. క్షతగాత్రులు, అత్యవసరంగా వైద్యం అందాల్సిన రోగులకు సిబ్బంది కాల్‌సెంటర్‌ ద్వారా హైదరాబాద్‌లోని వైద్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ వారి సూచనలతో చికిత్స అందిస్తున్నారు.

వాహనాల నిర్వహణపై దృష్టి

జిల్లాలోని 108 వాహనాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇటీవల ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట మండలాల వాహనాలు మొరాయించడంతో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. వాహనాలను కండీషన్‌లో ఉంచి ఫోన్‌కాల్‌ అందిన పది నిమిషాల్లోపే ప్రమాద స్థలానికి చేరుతున్నాయి. వాహనాల్లో ట్రాన్స్‌పోర్టు వెంటిలేటర్‌, ఆక్సిజన్‌, బీపీ ఆపరేటర్‌, గ్లూకోమీటర్‌, థర్మామీటర్‌, స్టెతస్కోప్స్‌, పల్స్‌ ఆక్సిమీటర్‌, అత్యవసర సమయంలో వాడే మందులు అందుబాటులో ఉన్నాయి.

108 సేవలు ఇలా..

108 వాహనాలు ఇలా..

జిల్లా వాహనాలు

కరీంనగర్‌ 16

రాజన్నసిరిసిల్ల 12

జగిత్యాల 15

పెద్దపల్లి 11

సిబ్బంది ఇలా..

జిల్లా ఈఎంటీ పైలట్స్‌

కరీంనగర్‌ 39 41

రాజన్నసిరిసిల్ల 27 27

జగిత్యాల 36 38

పెద్దపల్లి 26 27

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement