కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి | - | Sakshi
Sakshi News home page

కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి

Aug 14 2026 11:58 PM | Updated on Aug 14 2026 11:58 PM

ధర్మపురి: కోడిపందెం స్థావరంపై పోలీసులు దాడి చేసిన ఘటన మండలంలోని రాయపట్నం గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై సదాకర్‌ తెలిపిన వివరాలు.. గ్రామ శివారులో కొందరు కోడి పందేలు ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, కొందరు పారిపోయారు. ఘటన స్థ లంలో రూ.వెయ్యి నగదు, ఒక కారు, 5 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రూ.2.50 లక్షల మద్యం పట్టివేత

కథలాపూర్‌(వేములవాడ): కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌, బొమ్మెన గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.2.50 లక్షల విలువగల మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు అబ్కారీశాఖ సూపరింటెండెంట్‌ తిరుపతి శుక్రవారం తెలిపారు. మద్యం బాటిళ్లను మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి నిల్వ చేసి గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి మద్యం బాటిళ్లు కథలాపూర్‌ మండలంలోని గ్రామాలకు అక్రమంగా సరఫరా అవుతుందని సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. గంభీర్‌పూర్‌లో జవ్వాజి శ్రీనివాస్‌, బొమ్మెన గ్రామంలో పంజాల గంగాధర్‌ వద్ద రూ.2.50 లక్షల విలువ గల విస్కీ బాటిళ్లు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు న మోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తని ఖీల్లో అబ్కారీశాఖ మెట్‌పల్లి సీఐ వినోద్‌ రాథో డ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ నరేందర్‌రెడ్డి, రాజ మౌళి, ఎస్సైలు సందీప్‌, మాజిద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement