కోరుట్ల: పట్టణంలోని గడి బురుజుల సమీపంలో మైసమ్మ తల్లి విగ్రహం వద్ద కూల్చేసిన షెడ్డును తిరిగి నిర్మిస్తామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం గడి బురుజుల వద్ద మైసమ్మతల్లి విగ్రహానికి బీజేపీ ఆధ్వర్యంలో రేకులషెడ్డు ఏర్పాటు చేయగా, గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో శుక్రవారం నాయకులు మైసమ్మతల్లి విగ్రహాన్ని సందర్శించారు. గడి గురుజుల ప్రాంతంలో కొందరు అక్రమంగా సామిల్ డిపోలు, ఫంక్షన్ హాళ్లు, ఆయిల్ మిల్ నిర్మించుకున్నారని, ఇప్పుడు కొందరు కోనేరు కూడా ఆక్రమించుకునేందుకు ప్రమయత్నిస్తున్నారని ఆరోపించారు. మైసమ్మతల్లి విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ అనుమతితోనే షెడ్డు ఏర్పాటు చేశామని, దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం సరికాదన్నారు. గడి బురుజుల ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు తొలగించకుంటే ఆందోళనలు చేపడతామని, మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. అనంతరం సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై శ్యామ్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ ధార్మికసెల్ జిల్లా కార్యదర్శి మాడవేణి నరేశ్, పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యరద్శి ఎర్ర రాజేందర్, చెట్లపల్లి సాగర్, మ్యాకల గణేశ్, నవీన్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, శ్రీనివాస్, రాజేంద్ర, బాల్క ప్రేమ్, యువమోర్చా అధ్యక్షుడు దమ్మ సంతోష్, దళిత మోర్చా అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.


