జగిత్యాలరూరల్: పోలీస్ వాహనాన్ని ఆవు వెంటాడి తరమగా, సీసీ కెమెరాల్లో రికార్డయింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి 2 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది వాహనం సైరన్ వేసుకుని వెళ్లగా, సైరన్ విన్న ఆవు ఒక్కసారిగా బెదిరి పోలీసు వాహనాన్ని వెంటాడి తరిమింది. దీంతో పోలీసులు ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టి వెళ్లిపోయారు.
రెండిళ్లలో చోరీ
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరిలో రెండిళ్లోల చోరీ జరిగింది. ఎస్సై జగదీశ్వర్ వివరాల ప్రకారం గ్రామంలోని దేవులపల్లి జ్యోతి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి, బీరువా పగులగొట్టి రూ.50వేల నగదు, తులం బంగారం, సామగ్రి ఎత్తుకెళ్లారు. శ్రీ మూర్తి వెంకటముత్యం ఇంట్లో ఎవ రూ లేని సమయంలో 90తులాల వెండి వస్తువులు అపహరించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.


