కలెక్టర్‌ను కలిసిన డీఐఈవో | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన డీఐఈవో

Aug 14 2026 11:58 PM | Updated on Aug 14 2026 11:58 PM

జగిత్యాల: ఇటీవల డీఐఈవోగా బాధ్యతలు స్వీకరించిన రమేశ్‌బాబు శుక్రవారం కలెక్టర్‌ సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): అత్తింటి వారి కట్నం వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఆరేపల్లిలో విషాదం నింపింది. ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాలు. ఆరేపల్లికి చెందిన మరిజ సంకీర్తన(27) బెజ్జంకికి చెందిన సోమని రమేశ్‌ను ప్రేమించగా కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు కరీంనగర్‌లో ఉంటున్నారు. రమేశ్‌ ఆటో నడుపుతున్నాడు. రెండు నెలల క్రితం ఆరేపల్లికి రమేష్‌ భార్యతో సహా వచ్చి ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. ఈక్రమంలో సంకీర్తన గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తండ్రి జయాదన్‌రావు తన కూతురును భర్త రమేశ్‌, అత్త లచ్చవ్వ, మామ నర్సయ్య, మరదలు శివ, ప్రవీణ్‌ వరకట్నం తీసుకురమ్మని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్‌ సురేష్‌ శవ పంచనామ చేసి పోస్టుమార్టంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement