కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూలో డ్రో ఎక్స్‌ప్లోర్ పేరిట రెండు రోజుల సాంకేతిక శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు, ఇ్‌నిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్, జేఎన్టీయూ(హెచ్) టీబీఐ సంయుక్తంగా ఈ శిక్షణను నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు డ్రోన్ సాంకేతికత, యూఏవీ వ్యవస్థలు, సిమ్యులేషన్, నావిగేషన్‌పై సైద్ధాంతిక, ప్రాయోగిక శిక్షణ అందిస్తున్నారు. ఏరోఫోర్జ్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ఆదర్శ్ డ్రోన్ ప్రాథమిక అంశాలు, వినియోగాలు, విమాన గమనశాస్త్రం, ఆధునిక సాంకేతికతపై వివరించారు. వ్యవసాయం, నిఘా, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల్లో డ్రోన్‌ల వినియోగాన్ని వివరించారు. అనంతరం వే పాయింట్ ఆధారిత మిషన్ ప్రణాళిక, యూఏవీ సిమ్యులేషన్‌పై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.నరసింహ, వైస్ ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్, విభాగాధిపతులు సి.రాధాచరణ్, సీహెచ్.శ్రీధర్‌రెడ్డి, ప్రొఫెసర్ ఎస్.సురేష్, జేఎన్టీయూ(హెచ్) టీబీఐ ప్రోగ్రాం మేనేజర్ స్వాతి ఆనందం పాల్గొన్నారు.


