ఇబ్రహీంపట్నం: తాను డాక్టర్ అయినా.. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని కేజీబీవీ, జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. ఇప్పుడు చదువుకునేందుకు పాఠశాలలు, హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ.. కష్టపడి చదివిస్తున్నారని, వారి కలలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు. తనను యూకేజీ సమయంలోనే హాస్టల్‌లో వేశారని, కష్టపడి చదివి డాక్టర్ అయ్యానని తెలిపారు. పిల్లలకు పెడుతున్న భోజనం పరిశీలించి, వారితో కలిసి భోజనం చేశారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తయారు చేస్తున్న రోబోటిక్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ల్యాబ్ భవనాన్ని నాణ్యతతో చేయించాలని ఏఈ శశికుమార్‌ను ఆదేశించారు. సర్పంచు బద్దం గోపి, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేశ్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రజిత, ఉపసర్పంచు రమేశ్ పాల్గొన్నారు.


