అంగన్‌వాడీల్లో కొలువుల జాతర | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో కొలువుల జాతర

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

● పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ● జిల్లాలో 64 పోస్టులకు నోటిఫికేషన్‌ ● అభ్యర్థి కనీసం ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి ● దరఖాస్తు చేసుకునే 1–07–2020 నాటికి 18 నుంచి 35 ఏళ్ల వయస్సు మించకూడదు. ● స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతంలో అయితే సంబంధిత వార్డులో నివసించాలి. ● గ్రామీణ ప్రాంతంలో అయితే సంబంధిత గ్రామపంచాయతీలో నివసించాలి. అక్కడే అంగన్‌వాడీ కేంద్రం ఉండాలి. ● ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రకారం ఎస్సీ ఆవాసానికి కేటాయించిన పోస్టులు అదే హామ్లెట్‌/ఆవాసానికి చెందిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ● ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రకారం ఎస్టీ ఆవాసానికి కేటాయించిన పోస్టులు అదే హామ్లెట్‌/ఆవాసానికి చెందిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ● ఇంటర్మీడియెట్‌ మార్కుల మెరిట్‌కు 70 మార్కులు ● ప్రత్యేక కేటగిరీ వితంతువులకు 5 మార్కులు ● అనాథలకు 10 మార్కులు ● దివ్యాంగులకు 5 మార్కులు ● జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకు 10 మార్కులు ● పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ ● తహసీల్దార్‌ జారీ చేసిన ఏడాదిలోపు తీసుకున్న నివాస ధ్రువీకరణ పత్రం ● విద్యార్హత, మార్కుల జాబితా ● కుల ధ్రువీకరణ పత్రం ● ప్రత్యేక కేటగిరీల వారు సదరం ధ్రువీకరణ పత్రం, భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అనాథ ధ్రువీకరణ పత్రం ఉండాలి. ● దరఖాస్తుతోపాటు, ధ్రువీకరణ పత్రాలు గెజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌తో 7–8–2026 నుంచి 21–08–2026 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌ WDCW.TG.NIC.IN ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. ● దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో 27–08–2026 నుంచి 5–9–2026 వరకు కార్యాలయం పనివేళల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోడవు. ● ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన దరఖాస్తులను, ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోబడును.

జగిత్యాల: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 64 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ పోస్టులకు నోటిఫికేషన్‌ రావడంతో అర్హులకు అవకాశం లభించనుంది. జిల్లాలోని నాలుగు ప్రాజెక్ట్‌లలో 1085 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. టీచర్ల పోస్టుల భర్తీ అనంతరం ఆయాలను నియమిస్తామని సంక్షేమాధికారి ఆడెపు భాస్కర్‌ తెలిపారు.

అర్హతలు

ఎంపిక విధానం

ధ్రువీకరణ పత్రాలు

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు

ధర్మపురి 16

జగిత్యాల 22

మల్యాల 12

మెట్‌పల్లి 14

మొత్తం 64

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement