రాయికల్: మండలంలోని లోక్యనాయక్‌తండా, మంక్త్యానాయక్‌తండాల్లో గురువారం శీత్లాభవాని వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత హాజరయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతినాయక్, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మారంపల్లి రాణి, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రావు, గిరిజన శక్తి జిల్లా నాయక్ సంతోష్‌నాయక్, శంకర్‌నాయక్, బీఆర్‌ఎస్ నాయకులు రమాపతిరావు, సంతోష్‌రావు, రాజేందర్‌గౌడ్, భూక్య రమేశ్, భూక్య భాస్కర్, గంగమణి పాల్గొన్నారు.


