వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్నడు కేసీఆర్‌పై అక్కసుతోనే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడంలేదు ముఖ్యమంత్రిపై బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ఫైర్ మెట్‌పల్లి మండలం వెల్లులలో సర్‌పై అవగాహన
మెట్‌పల్లిరూరల్: రాష్ట్రానికి పట్టిన శని సీఎం రేవంత్‌రెడ్డి అని, అధికారంలోకొచ్చాక అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నాడని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లుల శివారులోని ఓ గార్డెన్‌లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏలకు సర్‌పై గురువారం అవగాహన కల్పించారు. సర్‌పై పలు విషయాలను వివరించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియతో వలస వచ్చిన వారికి, సంచార జాతులకు ఇబ్బందిగా మారిందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను రేవంత్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడని, అతడిని గద్దె దించేవరకూ పోరాటం చేస్తానని, ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రైతులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వారిని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కరువు ప్రభావంతో ఎక్కడా నాట్లు వేయడం లేదని, వాస్తవానికి ఇప్పటికీ నాట్లు పూర్తి కావాల్సి ఉండేదని గుర్తుచేశారు. రేవంత్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ.. మాజీ సీఎం కేసీఆర్‌పై అక్కసుతోనే ఎత్తిపోయకుండా కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డి, నాయకులు మారు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


