విద్యుత్ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ 1912
● ప్రజలకు అందుబాటులో 24/7 సేవలు
కొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలందించే క్రమంలో 1912 టోల్ ఫ్రీ సేవలను మరింత విస్త్తృత పరిచినట్లు కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి టోల్ ఫ్రీ సేవలు నిర్వహిస్తారని, 16 సర్కిళ్ల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఫేయిల్యూర్, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు, కరెంట్ బిల్లులో హెచ్చుతగ్గులు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, విద్యుత్ మీటర్ల మార్పు, అన్నిరకాల కొత్త సర్వీసుల మంజూరుకు సంబంధించి పేరు మార్పు, కేటగిరీ, లోడ్ మార్పు తదితర సమస్యలకు టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించి సేవలు పొందాలని కోరారు. 24/7 అందుబాటులో ఉండే ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలోనే కొండగట్టు అభివృద్ధి
మల్యాల: కాంగ్రెస్ పాలనలోనే కొండగట్టు అభివృద్ధి జరిగిందని, బీఆర్‌ఎస్ పాలనలో రూపాయి కూడా విడుదల చేయలేదని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ అన్నారు. కొండగట్టు అభివృద్ధికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఏమీ చేయలేదంటున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వ్యాఖ్యలను ఖండించారు. అభివృద్ధిపై చర్చకు రావాలన్న రవిశంకర్ వ్యాఖ్యలను సవాలు చేస్తూ.. మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టులోగల వైజంక్షన్ వద్దకు జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. రవిశంకర్ చర్చకు రావాలని సవాలు విసిరారు. ఈ సందర్భంగా ముత్యం శంకర్ మాట్లాడుతూ కొండగట్టులో కొత్త కోనేరు నిర్మాణం కాంగ్రెస్ పాలనలో నిర్మించినవే అన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్ల నిధులు మంజూరు చేశామనేది వాస్తవం కాదని, కేవలం జీవో మాత్రమే జారీ చేశారని గుర్తు చేశారు. రవిశంకర్ ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి తీసుకురాలేదని అన్నారు. కొండగట్టులో చేపట్టిన అభివృద్ధి పనులకుసైతం దేవాలయ నిధులతో చేపట్టినవేనని అన్నారు. అభివృద్ధిపై చర్చకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అవసరం లేదని, యూత్ కాంగ్రెస్ చాలని అన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి సహకరించాలని 2024లో మేడిపల్లి సత్యం పవన్ కల్యాణ్‌కు వినతిపత్రం సమర్పించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు నేరళ్ల సతీశ్ రెడ్డి, గాజుల అజయ్ గౌడ్, శ్రీకాంత్, రాజు, మహేశ్, అనిల్, జలందర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వోను కలిసిన టీఎన్జీవోస్
జగిత్యాలజోన్: డీఎంహెచ్‌వో సుజాతను సోమవారం టీఎన్జీవో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏనుగంటి రాజేశం, జిల్లా కార్యదర్శి కుత్‌బుద్దిన్, సంఘం నాయకులు సుగుణాకర్, శైలజ, విజయలక్ష్మి, అరుణ, నారాయణ పాల్గొన్నారు.


