అమ్మకు అక్షరమాల విజయవంతం చేయాలి
జగిత్యాలజోన్: మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మకు అక్షరమాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం అమ్మకు అక్షరమాల కార్యక్రమం నిర్వహించారు. రాజాగౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక మహిళా గ్రూపు సభ్యులు చదవడం, రాయడం నే ర్చుకోవాలన్నారు. మెప్మా ఏవో శ్రీని వాస్‌గౌడ్, డీఎంసీ సునీత, టీఎంసీ రజిత, సీవోలు రాధా, గంగారాణి, శరణ్య, సీఆర్‌పీలు పాల్గొన్నారు.
గ్రావిటీకి సహకరించాలి
పెగడపల్లి: గ్రావిటీ కాలువ నిర్మాణానికి రైతులు సహకరించాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–2 కింద నిర్మించే కాలువ భూ సేకరణకు మండలంలోని నందగిరి, ల్యాగలమర్రి గ్రామాల్లో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఆర్డీ వో మాట్లాడుతూ నందగిరి శివారులో 8మంది రైతుల నుంచి 1.08 ఎకరాలు, ల్యాగలమర్రికి చెందిన 125 మంది రైతుల నుంచి 41.24 ఎకరాలు, దీకొండలో 48 మంది నుంచి 16.18 ఎకరాలు గ్రావిటీ కోసం భూసేకరణ చేయడం జరిగిందన్నారు. ఇందుకు ప్రభుత్వం పరిహా రం చెల్లిస్తుందన్నారు. సర్పంచ్‌లు సురేందర్‌రావు, రజిత, రవి, డీఈ నర్సింగరావు, తహసీల్దార్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.
విజ్ఞానం పెంచుకోవాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థులు ప్రజ్ఞా పాటవ పోటీల్లో పాల్గొని విజ్ఞానాన్ని పెంచుకోవాలని డీఐఈవో నారాయణ సూచించారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మండలంలోని తొమ్మిది హై స్కూళ్లకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞాపాటవ పోటీలు నిర్వహించారు. గోధూర్ హైస్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి, మోడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి, వేములకుర్తి విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. వీరికి ఎంఈవో మధు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందించారు. ఎంపీడీవో చిప్ప గణేశ్, ప్రిన్సిపాల్ సంజీవ్ పాల్గొన్నారు.
క్రీడోత్సవాల్లో జయకేతనం
జగిత్యాలఅగ్రికల్చర్: అంతర్ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ క్రీడోత్సవాల్లో జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ కళాశాల జట్టు జయకేతనం ఎగురవేసింది. ఈ పోటీలు జనవరి 3 నుంచి 6 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగాయి. పొలాస వ్యవసాయ కళాశాల జట్టు వాలీబాల్, చెస్‌లో ప్రథమ స్థానాన్ని, క్రికెట్, అథ్లెటిక్స్‌లో రెండోస్థానం, రిలే పరుగు పందెంలో తృతీయస్థానాన్ని దక్కించున్నాయి. జట్టు మేనేజర్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ రత్నాకర్ వ్యవహరించారు.
పాఠశాల తనిఖీ
కథలాపూర్: కథలాపూర్ మండలం అంబారిపేట జెడ్పీహైస్కూల్‌ను జిల్లాస్థాయి ప్యానెల్ బృందం మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థుల రికార్డులు పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. నోడల్ అధికారి రాజేందర్, ఎస్‌ఆర్‌జీ మనోహరచారి, హెచ్‌ఎం కిషన్‌రావు పాల్గొన్నారు.
10 నుంచి పరీక్షలు
జగిత్యాలజోన్: జిల్లాలో ఈ నెల 10 నుంచి 13వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాము తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హైయర్ గ్రేడ్ పరీక్షల హాల్‌టికెట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు.
అమ్మకు అక్షరమాల విజయవంతం చేయాలి
అమ్మకు అక్షరమాల విజయవంతం చేయాలి
అమ్మకు అక్షరమాల విజయవంతం చేయాలి
అమ్మకు అక్షరమాల విజయవంతం చేయాలి


