ఉపాధి.. హామీ!
పాలకులకు అండగా ఉపాధి పథకం ప్రణాళికతో పనులు చేయిస్తే కూలీలకు మేలు.. పల్లెల్లో ప్రగతి సర్పంచులు దృష్టిసారిస్తే అభివృద్ధి సాధ్యం
గ్రామాభివృద్ధికి
జగిత్యాల: ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి.. కొత్త పాలకవర్గాలు కొలువుదీరా యి. సర్పంచ్‌గా ఎన్నికై నందుకు సంబరంగా ఉ న్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలకు నిధుల కొరత వెంటాడుతుండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సవాలే. ఈ పరిస్థితుల్లో ఉపాధిహామీ పథకం అండగా నిలుస్తోంది. పక్కాగా, ప్రణాళికబద్ధంగా పనులు చేయించగలిగితే కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, పల్లెలను ప్రగతి దిశగా తీసుకుపోవచ్చు. గతంతో పోలిస్తే పథకంలో కొన్ని మార్పులు చేశారు. పథకంపేరు మార్చడంతో పాటు పనిదినాలు 100 నుంచి 125కు పెంచారు. 266 పనులు అదనంగా గుర్తించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాటిపై సర్పంచులు దృష్టిసారిస్తే గ్రామాభివృద్ధి ఇట్టే సాధ్యం.
‘దారి’ వేసుకోవచ్చు
గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పంట పొలా లకు దారులు లేని ప్రాంతాలకు ఉపాధి పథకం కింద పొలం బాటలు వేసుకోవచ్చు. ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలవుతుంది. పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం లేకుంటే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకునే వీలుంది.
హరితహారం పెంచాలి
గ్రామాల్లో మొక్కలునాటి హరితవనం పెంపొందించేందుకు వీలుంది. పంచాయతీల్లో నర్సరీ అందుబాటులో ఉంటుంది. గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం.. పోషణకూ డబ్బులు ఇస్తున్నారు.
నీటిని నిల్వచేసుకోవచ్చు
సాగు భూముల్లో కాంటూరు కందకాలు, ఊటకుంటలు, పాంపాండ్స్, చెక్‌డ్యాంలు, రాళ్లకట్టలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని పక్కాగా పనులు పూర్తిచేస్తే.. భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది.
స్వచ్ఛ గ్రామాలుగా ముందుకెళ్లొచ్చు
గ్రామాలను సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉంది. మరుగుదొడ్ల నిర్మాణంలో అవసరమైన గుంతలను కూలీలతో తవ్వించి, ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించవచ్చు.
సాగు.. బాగు..
చెరువులు, చెక్‌డ్యాంలు, ఊటకుంటలు, ప్రాజెక్టు కాల్వల నుంచి పూడిక తీసుకునేందుకు అవకాశ ముంది. కూలీలతో పనులు చేయిస్తే వారికి ఉపాధి చూపడంతో పాటు నీటి వనరులు బాగు చేసుకో వచ్చు. సాగునీటి సమస్య లేకుండా చేసుకోవచ్చు.
వీరిని సంప్రదించండి
ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు మండలస్థాయిలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. జిల్లాలో పీడీతో పాటు ఏపీడీ, మండలాల్లో ఏపీవో, సాంకేతిక సహాయకులు, గ్రామాల్లో క్షేత్ర సహాయకులు ఉంటారు. మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనుల గుర్తింపు, ఎంపిక, ఆమోదం, మంజూరు ఉంటాయి.
ఉపాధి కూలీలు
2.74 లక్షలు
జాబ్‌కార్డులు ఉన్నవారు 1.68 లక్షలు
0
ఉపాధి నిధులతో గ్రామాల అభివృద్ధి
గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులే కీలకం. గతంలో పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. గత పాలకులు సైతం అప్పుల పాలయ్యారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధిహామీ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నిధులు మంజూరు చేస్తుందనే నమ్మకంతో అభివృద్ధి పనులు చేపడుతాం. రాష్ట్ర ప్రభుత్వం నిధులు వస్తే మరింత మంచిది.
– మల్యాల రమేశ్, సర్పంచ్, దుంపేట, కథలాపూర్
ఉపాధి.. హామీ!
ఉపాధి.. హామీ!


