గంజాయి విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా
కథలాపూర్: మండలంలోని బొమ్మెన గ్రామంలో గంజాయి విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. బుధవారం గ్రామపంచాయతీ పాలకవర్గం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసిందని, వారి సమాచారం అందించినవారికి రూ.2లక్షలు బహుమతిగా ఇస్తామని, విక్రయించినవారికి రూ.5లక్షలు జరిమానా విధిస్తామన్నారు. గంజాయితో యువత అనారోగ్యం బారిన పడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ చిందం సుధాకర్, ఉపసర్పంచ్ పిడుగు తిరుపతిరెడ్డి తెలిపారు.
ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
జగిత్యాలజోన్: మహిళలు బాల్యం దశ నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల అధ్యక్షుడు గూడూరు హేమంత్ అన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో బుధవారం జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన శైలితోపాటు పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేందుకు బాలికలు అధిక ప్రా ధాన్యత ఇవ్వాలని సూచించారు. ఐఎంఏ ప్రఽ దాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి మా ట్లాడుతూ.. ప్రతినెలా ఒక ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించి.. ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా 74 మంది విద్యార్థినులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించగా.. 59మందికి రక్తహీనత ఉన్నట్లు వైద్యులు గుర్తించి వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు ఆగంతుల నరేష్, హరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
33 స్కూళ్లలో 6,652 మందికి కంటి పరీక్షలు
జగిత్యాలజోన్: జిల్లాలోని 33 పాఠశాలల్లో 6, 652 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశామని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్ విద్యార్థులకు బుధవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 41,023 మంది ఉన్నారని, వీరిలో 6,652 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 33 మంది విద్యార్థులను మెరుగైన కంటి వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు పంపించామని, దృష్టి లోపం కలిగిన 459 మంది విద్యార్థులకు అద్దాలు పంపిణి చేశామన్నారు. విద్యార్థులు పోషకాహారమైన పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, వైద్యులు సురేందర్, విద్య, హెచ్‌ఎండీ రవీందర్, అధికారులు తిరుపతి, శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు
ఎంఐఎం జిల్లా అధ్యక్షుడిగా లియాఖత్ అలీ మొహసిన్
జగిత్యాలటౌన్: ఎంఐఎం జిల్లా అధ్యక్షుడిగా లియాఖత్ అలీ మొహసిన్, పట్టణ అధ్యక్షుడిగా సుమేరొద్దీన్ ఎన్నికై నట్లు ఉమ్మడి కరీంనగర్ జి ల్లా అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ ప్రకటించారు. బల్దియాల్లో అత్యధిక స్థానాలు సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. జిల్లా, పట్టణ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనంతరం నూ తన కమిటీని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి గా రజియొద్దీన్, ఉపాధ్యక్షులుగా ఆదిల్‌పటేల్, అబ్దుల్ బాసిత్, అఫ్రోజ్, జాయింట్ సెక్రెటరి గా ఇక్రంహుస్సేన్, నజీముల్లఫహీం, హఫీజ్ శంషుద్దీన్, అమీయమాని, అఫ్జల్ మొహియుద్దీన్, మహ్మద్ జాకీర్‌అలీ, అబ్దుల్ గఫార్ చాంద్‌ను నియమించారు.
గంజాయి విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా
గంజాయి విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా
గంజాయి విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా


