పొరపాటు.. దిద్దుబాటు
● జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 136 వార్డులున్నాయి.
● దాదాపు ప్రతిచోటా ఒక వార్డుకు చెందిన వందలాది ఓటర్లు మరో వార్డు జాబితాలోకి వెళ్లిపోయాయి. దీంతోపాటు గ్రామాలు, ఇతర పట్టణాల ఓటర్లు కూడా ఉన్నారు.
● తద్వారా వార్డు ఓటర్ల సంఖ్య పెరగడమే కాకుండా వారంతా ఇతర వార్డులు, ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. (ఉదాహరణకు: మెట్‌పల్లి పట్టణంలోని 26వార్డుకు చెందిన సుమారు 200 ఓట్లు 21వార్డు ఓటరు జాబితాలో చేర్చారు. అలాగే కోరుట్ల మున్సిపాలిటీతో చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన పలువురి ఓటర్ల పేర్లు ఇక్కడి జాబితాల్లో ఉండడం గమనార్హం)
● ఇవి తమ గెలుపోటములపై ప్రభావం చూపుతాయని ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో అధికారులు వాటిని సరి చేసే పనిలో నిమగ్నమయ్యారు.
● ఓటర్ల తుది జాబితాను మొదట ఈనెల 10న విడుదల చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని బుధవారం నిర్వహించిన సమావేశంలో 12న ప్రకటించాలని సూచించారు.
● అలాగే 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించాలని ఆదేశించారు.
● దీంతో జిల్లా అధికార యంత్రాంగం వీటికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
● పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను మార్చిన ప్రభుత్వం.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా గతంలో ఉన్న రిజర్వేషన్లను మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
● ఓటర్ల తుది జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలు వెల్లడైన తర్వాత రిజర్వేషన్లపై దృష్టి సారించే అవకాశముంది.
● వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను కలెక్టర్ నిర్ణయిస్తే.. చైర్మన్ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయనుంది.
మెట్‌పల్లి: మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితాల్లో తప్పులను సవరించడానికి అధికారులు వార్డుల బాట పట్టారు. ఈ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నా రు. ప్రతి వార్డు జాబితా తప్పుల తడకగా ఉండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటిని సరిదిద్ది తుది జాబితాను పకడ్బందీగా రూ పొందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వార్డుల్లో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ఓటరు జాబితాలతో ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తున్నారు.
ఆశావహుల అందోళన
12న తుది జాబితా ప్రకటన
వార్డుల రిజర్వేషన్ల నిర్ణయించేది కలెక్టరే..
ముసాయిదా జాబితా అభ్యంతరాలపై క్షేత్ర పరిశీలన
పకడ్బందీగా తుది జాబితా రూపొందించడంపై దృష్టి