రోడ్డు భద్రత అందరి బాధ్యత
జగిత్యాల: రోడ్డు భద్రత నియమాలు ప్రతిఒక్కరూ పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంపై బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధికవేగం ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనపత్రాలు సక్రమంగా చూ సుకోవాలన్నారు. రోడ్డు సేఫ్టీ ప్రతి ఒక్కరి బా ధ్యత అని, హెల్మెట్ ధరించండి... ప్రాణాలు కాపాడుకోండి అని ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ లత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
● అదనపు కలెక్టర్ రాజాగౌడ్
మెట్‌పల్లి: ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ సిబ్బందికి సూచించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి స్థానిక మున్సిపాల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మెప్మా భవనంలో అక్షరమాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. స్వశక్తి సంఘాల్లోని ప్రతి మహిళా చదవడం, రాయడం నేర్చుకోవాలన్నారు. అక్షరమాల సిలబస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని ఓపెన్ స్కూలింగ్ సిస్టం ద్వారా పదోతరగతి ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేయాలన్నారు. కమిషనర్ మోహన్, మెప్మా ఏవో శ్రీనివాస్‌గౌడ్, సిబ్బంది ప్రతాప్‌రావు, సునీత, శివకుమార్, జ్యోతి తదితరులున్నారు.
గోదాం పనులు పరిశీలన
జగిత్యాలరూరల్: గోదాం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయాల నాగేశ్వర్‌రావు అన్నారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో నిర్మిస్తున్న గోదాం పనులను గురువారం పరిశీలించారు. పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు.
లక్ష్యంతో ముందుకుసాగాలి
మల్లాపూర్: విద్యార్థులు లక్ష్యంతో ముందుకుసాగాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాఘవపేట జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వాన్ని అలవర్చుకుని గొప్ప లక్ష్యం వైపు అడుగులు వేయాలని, తద్వారా పాఠశాల, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. పదో తరగతి పరీక్షల్లో భయం వీడి ప్రశాంతంగా సిద్ధం కావాన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ, ఎంఈవో దామోదర్‌రెడ్డి, సర్పంచ్‌లు చిట్యాల లక్ష్మణ్, తోట శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, నాయకులు పాల్గొన్నారు.
రైతులు ఉమ్మడిగా మార్కెటింగ్ చేయాలి
జగిత్యాలఅగ్రికల్చర్: రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా రైతులు పంటలను మార్కెటింగ్ చేస్తేనే లాభం ఉంటుందని డీసీవో మనోజ్‌కుమార్ అన్నారు. కొత్తగా ఏర్పడిన 16 రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు, సంస్థ సీఈఓలకు అవగాహన కల్పించారు. వ్యవసాయరంగంలో వస్తున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి, పంట దిగుబడులు తీయడంలో కీలకపాత్ర వహించాలన్నారు.
రోడ్డు భద్రత అందరి బాధ్యత
రోడ్డు భద్రత అందరి బాధ్యత


