శుక్రవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
సునోజీ.. ఏఐ గురూజీ!
● ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ పాఠాలు ● డిజిటల్ విద్యతో ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
● బోధన సులభం.. అభ్యసన మెరుగు ● భాష పరిజ్ఞానంలో మంచి ఫలితాలు
● వెనుకబడిన విద్యార్థులకు ఎంతో మేలు
తిమ్మాపూర్: మూడేళ్లుగా మా పాఠశాలలో హిందీ పాఠ్యాంశాల బోధనలో నేను సొంతంగా సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నా. హిందీలో స్పష్టమైన ఉచాచ్ఛారణ నేర్చుకోవడానికి ఈ సాఫ్ట్‌వేర్ ఎంతో దోహదపడుతోంది. నేను రూపొందించిన ‘బడిబాట’ ప్రచార వీడి యో రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సాంకేతికతను తరగతి గదికి అనుసంధానించడం ద్వారా కఠినమైన పాఠాలను దృశ్యరూపంలో విద్యార్థులకు అందిస్తున్నా.
– షరీఫ్ అహ్మద్, హిందీ ఉపాధ్యాయుడు, మల్లాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల
విద్యాబోధనలో పలకాబలపం పద్ధతి మారింది. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో కంప్యూటర్ ప్రవేశించింది. డిజిటల్ విద్యతో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అభ్య సన(లెర్నింగ్)ను సులభతరమవుతోంది. వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థంకావడంలో దోహదపడుతోంది. ప్రైమరీ స్కూళ్లలో గణితం, ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులలో రాణించేందుకు ఉపయోగపడుతుంది. హైస్కూళ్లలో డిజిట ల్ బోర్డుల ద్వారా ఫ్లోచార్ట్, త్రీ డైమెన్షన్ మ్యాప్స్ పరిశీలించి పాఠాలు సులభంగా అర్థం చేసుకుంటున్నారు. పాఠ్యాంశాలను డిజిటలైజ్డ్ చేయడంతో విద్యార్థుల్లో జిజ్ఞాస పెరుగుతోంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు వినూత్న మార్పు తీసుకొచ్చాయి. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
శుక్రవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026


