పుర ఎన్నికలకు ఏర్పాట్లు
జగిత్యాల/రాయికల్: బల్దియా ఎన్నికలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను స్వీకరించి అభ్యంతరాలు పరిష్కరిస్తున్నారు. ఈ మేరకు మూడు నాలుగు క్లస్టర్లుగా విభజించి నోడల్ అధికారులను నియమించారు. మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ధర్మపురిలో 15 వార్డులు, జగిత్యాలలో 50, రాయికల్‌లో 12, కోరుట్లలో 33, మెట్‌పల్లిలో 26 వార్డులున్నాయి. ఈ మేరకు ధర్మపురిలో 24పోలింగ్ కేంద్రాలు, జగిత్యాలలో 149, రాయికల్‌లో 24, కోరుట్లలో 94, మెట్‌పల్లిలో 64కేంద్రాలు గుర్తించారు. జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో ఓటరు లిస్ట్, పోలింగ్ బూత్‌ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. 6వ వార్డులో ఉర్దూమీడియం పాఠశాల, 8వ వార్డులోని ఒడ్డెరకాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఆయన వెంట కమిషనర్ మనోహర్‌గౌడ్, ఎంపీవో సుష్మ, ఎస్సై సుధీర్‌రావు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన


