ఆయిల్ పాం సాగుతో లాభాలు
కొడిమ్యాల: ఆయిల్ పాం సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని డీసీవో మనోజ్ కుమార్ తెలిపారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ఆయిల్ పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ పాం సాగు ద్వారా వంట నూనెల దిగుమతి తగ్గుతుందన్నారు. ఆయిల్ పాం సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. మండల రైతులు సాగుకు ముందుకురావాలని కోరారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో ఆయిల్ పాం సాగుకు అవకాశం ఉందన్నారు. జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పాం సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్యాక్స్ పర్సన్ ఇన్‌చార్జి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మల్లేశం, మండల వ్యవసాయాధికారి జ్యోతి, కొడిమ్యాల ప్యాక్స్ కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


