అన్నగా చెబుతున్నా.. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి
రాయికల్: జిల్లా పోలీస్ బాస్‌గా కాదు.. అన్నగా చెబుతున్న.. డ్రగ్స్, మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి అని ఎస్పీ అశోక్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. రాయికల్ పట్టణంలోని ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో జిల్లా పోలీసుశాఖ, రాయికల్ జేఏసీ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి పోలీసు బాస్‌గా రాలేదని, అందరి అన్నయ్యగా వచ్చానని, డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని కోరారు. విద్యార్థులు లక్ష్యాలపై దృష్టి సారించి అనుకున్నది సాధించేందుకు ప్రయత్నించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగంతో విద్యార్థుల్లో శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయన్నారు. డ్రగ్స్ నిర్మూలన విద్యార్థులతోనే సాధ్యమన్నారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ తీసుకోమంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రాయికల్ జేఏసీ ప్రెస్‌క్లబ్ సభ్యులు అన్నారు. ఎస్పీని అభినందించారు. అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సుధీర్‌రావు, గీత, కృష్ణ, తహసీల్దార్ నాగార్జున, ఎంఈవో రాఘవులు, ఎంపీవో సుష్మ, జేఏసీ అధ్యక్షుడు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, కోశాధికారి మచ్చ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నగా చెబుతున్నా.. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి


