శంకర్ దాదాలు.. గాల్లో ప్రాణాలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో కొందరు శంకర్‌దాదా ఆర్‌ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అర్హత ఉండదు.. అనుమతులు ఉండవు. అయినా వైద్య చికిత్సలు చేసేస్తుంటారు. అడిగే వారు లేకపోవడం, తనిఖీలు చేసేవారు ఆ విషయమే మరచిపోవడంతో ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత్యంతరం లేక స్థానికంగా అందుబాటులో ఉందనే ఉద్దేశంతో తమ వద్దకు వస్తున్న రోగులకు చుక్కలు చూపుతున్నారు. రోగుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌ల వద్దనే ల్యాబ్, ఫార్మసీ ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలు చోట్ల ఆర్‌ఎంపీలు చేసిన వైద్యం వికటించి కొందరి ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్నారులు, బాలింతలు ఇబ్బంది పడిన ఉదంతాలూ వెలుగుచూశాయి. దీనికితోడు సమీప పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల వారితో ఆర్‌ఎంపీలు కుమ్మకై ్క రోగులను అక్కడికి పంపిస్తూ అడ్డగోలుగా ‘కమీషన్’ రూపంలో సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత నెల 26న..
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లోగల లక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై డ్రగ్
కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. అందులో 35 రకాల ఫిజీషియన్ నమూనా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ నిర్వహిస్తున్న వ్యక్తికి వైద్యుడిగా ఎలాంటి అనుమతి లేకపోయినా అర్హతకు మించి వైద్యం చేయడంపై కేసు
నమోదు చేశారు.
ఈనెల 6న..
ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో స్వర్గం సతీశ్‌బాబు నిర్వహిస్తున్న ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లో డ్రగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి 30 రకాల మెడిసిన్స్‌ను గుర్తించారు. ఇందులో యాంటీబయోటిక్స్, స్టిరాయిడ్స్, అనాల్జెసిక్స్, యాంటీఅల్సర్ డ్రగ్స్, యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్స్ ఉండడంతో అధికారులే కంగుతిన్నారు. అతనిపై కేసు నమోదు
చేశారు.
శంకర్ దాదాలు.. గాల్లో ప్రాణాలు


