అక్రమాలపై ఫిర్యాదు చేయండి..
సరైన అర్హతలు, నిబంధనలు లేకుండా యాంటీ బయాటిక్స్ డ్రగ్స్ విక్రయించడం, సరఫరా చేయడం చట్టవిరుద్ధం. డగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ 1940 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ కలిగిన ప్రతీ డ్రగ్ డీలర్, హోల్‌సేల్ వ్యాపారులు తమ మందుల సరఫరాలో పారదర్శకత పాటించాలి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) నిబంధనల ప్రకారం మందులు నిల్వ ఉంచాలి. ఎవరుపడితే వారు నిల్వ చేస్తే కఠిన చర్యలకు అర్హులవుతారు.
– షానవాజ్ ఖాసీం, డ్రగ్స్ కంట్రోల్
అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డైరెక్టర్ జనరల్
అర్హతకు మించి వైద్యం చేయొద్దు
ఆర్‌ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయకుండా నిబంధనలు పాటించాలి. ప్రజలు అర్హతలేని వైద్యుల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవడం వల్ల వ్యాధులు తగ్గకపోవడమే కాకుండా మరింత ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. అర్హత లేని వైద్యులను నమ్మవద్దు. ఆసుపత్రులు ఆర్‌ఎంపీలను ప్రోత్సహించడం, కమీషన్లు ముట్టజెప్పడం మానేయాలి. అర్హత, అనుభవం ఉన్న వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటే నాణ్యమైన వైద్యం అందుతుంది.
– ఆకుల శైలజ, ఐఎంఏ అధ్యక్షురాలు, కరీంనగర్
కేసులు నమోదు చేయాలి
అర్హత లేకున్నా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలి. వైద్యారోగ్యశాఖ, మెడికల్ కౌన్సిల్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టాలి. ఫిర్యాదు వచ్చినప్పుడే స్పందించడం కాకుండా రెగ్యులర్‌గా అర్హతలేని వైద్యంపై నిఘా పెడితే ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించినట్లవుతుంది. ప్రజలు అర్హతలేని వారి వద్దకు వైద్యం కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
– బీఎన్ రావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
అక్రమాలపై ఫిర్యాదు చేయండి..


