రోడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన
వెల్గటూర్: మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం అధికారులు కోటిలింగాలలో పుష్కరాల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా రోడ్డు నిర్మాణాల పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన పుష్కర పనులకు ముహూర్తం ఎప్పుడో అనే కథనానికి స్పందించారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా దృష్టి పెట్టామని పంచాయతీరాజ్ ఈఈ లక్ష్మణరావు, డీఈ గోపాల్ తెలిపారు. కోటిలింగాల ముఖ ద్వారం నుంచి నాలుగు వరుసల రోడ్డు, వెల్గటూర్‌లోని అయ్యప్ప ఆలయం ముందు నుంచి కాళేశ్వరం లింక్–2 ప్రాజెక్టును ఆనుకొని కోటిలింగాల ఆలయం వరకు నూతన రోడ్డు నిర్మాణానికి సాధ్యసాధ్యాలు పరిశీలించారు. కోటేశ్వరాలయం ఎదుట నూతన పుష్కర ఘాట్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ నెల 17న జరిగే సమావేశంలో పుష్కరపనులపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
రోడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన


