
ఆడపిల్లలు చదువులో రాణించాలి
జగిత్యాల: గురుకులాల్లో మెరుగైన విద్య అందుతుందని, ఆడపిల్లలు చదువులో రాణించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భవానీనగర్‌లో గల సోషల్ వెల్ఫేర్ గర్‌ల్స్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. స్టోర్‌రూమ్, వంటగది, కూరగాయలు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యావిధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మెస్‌చార్జీలు పెంచడంతో విద్యార్థులు ఎంతో మేలు జరిగిందన్నారు. సొంత భవనాలు లేని పాఠశాలలను గుర్తించి సీఎం దృష్టికి తీసుకెళ్లగా రూ.200 కోట్లు మంజూరు చేశారన్నారు. త్వరలోనే సొంత భవనాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయం
బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయమని ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు నిర్వహించిన రక్తదాన శిబిరంలో మాట్లాడారు. రోటరీ, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు టీవీ.సూర్యం, శ్రీనివాస్, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.
ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలి
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ఇటీవల ఏర్పడిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన కమిటీ సభ్యులు సోమవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో మంచాల కృష్ణ, గంగరాజం, టీవీ.సూర్యం, శ్రీను పాల్గొన్నారు.