
ఇసుక రీచ్‌ను రద్దు చేయండి
మాది మెట్‌పల్లి మండలం ఆత్మకూరు. మా గ్రామం నుంచి వెళ్తున్న పెద్దవాగుకు ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లో నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరస్తుండటంతో గ్రామంలో వాటర్ లెవల్ పడిపోయి పర్యావరణ, అసమతుల్య పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మాణించుకుని ఇసుక రీచ్ రద్దు చేయాలని గతేడాది తహసీల్దార్, ఆర్డీవోలకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చాం. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇసుక రీచ్‌ను రద్దుచేయడంతో పాటు నిఘా ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి.
– మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామస్తులు